
U Blood యాప్ అనేది జై గారి అద్భుత ఆలోచనని, తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నారు అలీ దంపతులు. అక్టోబర్ 10 నటుడు అలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు సినిమా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్స్ యూనియన్ అలీని ఘనంగా సన్మానించింది. డ్రైవర్స్ యూనియన్ కు అలీ అండగా నిలిచారని, మా డ్రైవర్ల పిల్లలు చదువుకోవడానికి, మరియు షాది ముబారక్ పేరు మీద నిరుపేద కుటుంబాలకు
10 వేల చొప్పున ఆర్ధిక సహాయం కూడా అందిస్తున్నారని
అలీపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక అలీ పుట్టినరోజు కావడంతో JSW & Jaiswaraajya ఛానల్స్ తరుపున అలీ దంపతులను సన్మానించారు సంస్థ కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్.
ఈ సందర్భంగా JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అలీ. ఈ కార్యక్రమంలో అలీతో పాటుగా అలీ శ్రీమతి జుబేదా అలీ కూడా పాల్గొన్నారు. రక్తదానం విశిష్టత తెలిపారు. యు బ్లడ్ యాప్ ని ప్రతీ ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని , తద్వారా అవసరమైన సమయాల్లో రక్తం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా అన్ని వివరాలు ఈ యాప్ లోనే ఉంటాయని ….. ఇలాంటి అద్భుతమైన యాప్ ని సృష్టించిన జై యలమంచిలిని తప్పకుండా అభినందించాల్సిందేనన్నారు. అలాగే అన్నయ్య చిరంజీవితో కూడా ఈ యాప్ గురించి మాట్లాడతనన్నారు అలీ. రోడ్డు ప్రమాదంలో, అలాగే ఇతర ఆపరేషన్ లలో పెద్ద ఎత్తున రక్తం అవసరం పడుతుందని, అలాంటి వాళ్లకు ఇదొక దివ్య ఔషదమని కొనియాడారు అలీ దంపతులు.