భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది నాగార్జున యూనివర్సిటీ. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగార్జున యూనివర్సిటీ చీఫ్ జస్టిస్ కు గౌరవ డాక్టరేట్ ని ఏపీ గవర్నర్ హరిచందన్ విశ్వ భూషణ్ చేతుల మీదుగా ఇప్పించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ తో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తనకు నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
Breaking News