
Pawan Kalyan Disease : ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కూడా తల్లికి చిన్న పిల్లాడు కిందే లెక్క.. అందుకే అంటుంటారు.. ఒక రాజ్యానికి రాజు అయిన తల్లి దగ్గరికి వచ్చే సరికి చంటి పిల్లాడితోనే సమానం అని.. తల్లికి బిడ్డ కనిపించగానే తిన్నావా ? లేదా? అని అడుగుతారు.. మరి ఆ కోవకే చెందుతారు మెగా మదర్ అంజనాదేవి.. ఈమెకు తన పిల్లలు అంటే ప్రాణం అని చెప్పాలి..
ఎలాంటి స్పెషల్ అకేషన్ ఉన్న కూడా కుటుంబం మొత్తం ఒకే దగ్గర కలుసు కోవాలని ఆమె చెబుతుంటారు.. కొణిదెల అంజనాదేవి గారికి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అనే విషయం అందరికి తెలుసు.. వీరిలో అబ్బాయిలు అయితే తెలుగు ఇండస్ట్రీకి బాగా సుపరిచితం.. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఇండస్ట్రీకి చెందిన వారే..
ఈమె తాజాగా తన చిన్న కొడుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించిన ఒక టాప్ సీక్రెట్ ను రివీల్ చేసారు. ఇటీవలే ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ గురించి ఆయన ఆరోగ్యం గురుంచి చెప్పుకొచ్చారు. పవన్ కు ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ ఉండదు అని.. ఎండలో, గాలిలో తిరుగుతూ ఉంటాడని చిన్నప్పుడు ఆస్తమా కుడా ఉందని అందుకే అతన్ని మరింత జాగ్రత్తగా చూసుకునేదాన్ని అంటూ ఈమె చెప్పుకొచ్చారు.
ఇంకా ఈమె మాట్లాడుతూ ప్రజానాయకుడిగా కోట్ల మందికి సేవ చేయాలనే బాధ్యత దేవుడు తనకు అప్పగించాడు అని ఏదో ఒక రోజు తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపారు. కాగా తాజాగా మదర్స్ డే సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి సెలెబ్రేట్ చేసుకున్నట్టు సమాచారం.. పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈయన సినిమాలు రిలీజ్ కానున్నాయి.