
Cockroaches : ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే అసహ్యంగా ఉంటుంది. అవి పాత్రలపై తిరుగుతుంటే వాటిని తోముకుని మళ్లీ శుభ్రం చేసుకుంటాం. ఇలా బొద్దింకల గోల తప్పించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వాటిని వెళ్లగొట్టే చిట్కాల కోసం చూస్తారు. వాటిని ఇంటి నుంచి శాశ్వతంగా తొలగించుకోవాలని భావిస్తారు. వాటితో మనకు ఎన్నో రకాల ఇబ్బందులు రావడం సహజమే. ఈ నేపథ్యంలో వాటిని ఇంట్లో లేకుండా చేయడం మన చేతుల్లోనే ఉంటుంది.
బొద్దింకలు పసుపు రంగును ఆకర్షిస్తాయి. ఇంట్లో పసుపు రంగు పాత్రలైనా వస్తువులైనా ఉంటే బొద్దింకలు వస్తుంటాయి. కిచెన్ లో ఈ రంగు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర వస్తువుల్లో కూడా పసుపు వర్ణం లేకుండా చూసుకోవాలి. దీంతో బొద్దింకలు కిచెన్ వైపు రావు. దోసకాయ ముక్కల వాసన కూడా బొద్దింకలకు పడదు. దీంతో అవి కిచెన్ లోకి రావు. అక్కడక్కడ దోస కాయ ముక్కలు ఉంచితే మంచిది.
బోరిక్ పౌడర్ కిచెన్ లో బొద్దింకలు వచ్చే చోట చల్లితే ఇన్ఫెక్షన్ కు గురై చనిపోతాయి. సబ్బు నీళ్లు బొద్దింకల మీద పోస్తే అవి చనిపోతాయి. బోరిక్ పౌడర్, మొక్కజొన్న పిండి, చక్కెర పొడి సమపాళ్లలో తీసుకుని అవి వచ్చే చోట చల్లితే దాన్ని తిని అవి ప్రాణాలు విడుస్తాయి. మనం తిన్న ఆహార పదార్థాలు కింద పడకుండా చూసుకోవాలి. లేకపోతే బొద్దింకలు వచ్చి ఇంటిని దారుణంగా మారుస్తాయి.
ఇలా బొద్దింకలు మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బొద్దింకలు ఇంట్లోకి వస్తే ఏది తినడానికి ఇష్టపడం. అందుకే వాటిని మన పరిసరాల్లోకి రానీయొద్దు. ఈ నేపథ్యంలో బొద్దింకలు మన ఇంట్లోకి వస్తే బాగుండదు. వాటిని లోనికి రాకుండా పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే సరి. వాటితో మనకు రోగాలు రావడం జరుగుతుంది. ఇలా బొద్దింకలను పారదోలాలి.