అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లోని పాటని ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే నిన్న సాయంత్రమే పుష్ప చిత్రంలోని పాట లీకయ్యింది. పాట లీకైన విషయం వెంటనే ఆ చిత్ర బృందం కు తెలియడంతో తీవ్ర షాక్ లోకి వెళ్లారు.
”దాక్కో దాక్కో మేక ” అనే పాట ఆగస్టు 13 న సాయంత్రం రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు సుకుమార్. కానీ అందుకు విరుద్దంగా పాట ఇంకా సిద్ధం కాకుండానే రఫ్ సాంగ్ ని లీక్ చేసింది ఎవరు ? అని చాలా సీరియస్ అయ్యాడట సుకుమార్.
డిజిటల్ రూపానికి సినిమా సంతరించుకుంది కాబట్టి డిజిటలైజేషన్ లో దేన్నీ దాచాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో ? ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
దాక్కో దాక్కో మేక అనే పాటకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుందని సినిమాపై భారీ అంచనాలు పెంచుతుందని ధీమాగా ఉన్నారు పుష్ప చిత్ర బృందం. కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ పాట లీక్ కావడంతో షాక్ లో ఉన్నారట.