
Remember this baby : తెలుగు సినిమాల్లో తమదైన అందాలతో మత్తెక్కించే భామలెందరో ఉన్నారు. దీంతో వారు తమ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసుకోవడం సహజం. తమ పుట్టిన రోజు సందర్భంగా తీసుకున్న చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో అభిమానులు కామెంట్లు పెడుతుంటారు. ఆమె మన తెలుగు తెరకు పరిచయమైన ఓ హీరోయిన్. పలు చిత్రాల్లో నటించి తన ప్రతిభ చూపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియాతో తెలుగు తెరకు పరిచయమైంది అదితి రావు హైదరి. తరువాత వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం లో నటించింది. నానితో వి శర్వనంద్ తో మహాసముద్రం, దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ తో కలిసి నా అనామికలో నటించింది. ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ ముద్గుగుమ్మ తెలుగు, తమిళం, కన్నడ, మళయాల తదితర భాషల్లో నటించి మెప్పించింది. హైదరాబాద్ లో పుట్టిన ఈమె పూర్వీకులు వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజుల కుటుంబం అని చెబుతోంది. ఇలా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ లో భాగంగా సోషల్ మీడియాలో తన చిన్ననాటి పిక్స్ పంచుకుంటోంది. ఈమె ఫొటో చూసిన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
హీరో హీరోయిన్లు అభిమానులను సందడి చేయడం సహజం. ఈ నేపథ్యంలో అదితి రావు తన చిన్ననాటి పిక్స్ ను షేర్ చేయడంతో అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వేదికగా దాన్ని వైరల్ చేస్తున్నారు. దీన్ని ఆమె కూడా అనుభూతి చెందుతోంది. అభిమానుల రెస్పాన్స్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. వారి ప్రేమకు ఫిదా అవుతోంది.