అభినవ దాన కర్ణుడిగా పేరుగాంచిన విలక్షణ నటుడు సోనూ సూద్ కు ఘనస్వాగతం లభించింది అమెరికాలో. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీలో గల ఎడిసన్ లో సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు జగదీశ్ యలమంచిలి. రక్తదానం గొప్పతనం , అవసరం గురించి ఆలోచించిన జగదీశ్ యలమంచిలి రక్త కొరతతో ఎవరూ బాధపడకూడదు అనే లక్ష్యంతో ”U Blood ”app ని సృష్టించారు. అలాంటి గొప్ప లక్ష్యానికి సోనూ సూద్ లాంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ అయితేనే తన యాప్ లక్ష్యం నెరవేరుతుందని భావించారు. జై లక్ష్యం నచ్చిన సోనూ సూద్ యు బ్లడ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈరోజు ఆగస్టు 14 న అమెరికాలోని న్యూజెర్సీ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమెరికాలోపలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలు ” తానా ” , ఆటా ”, ” నాటా ” , ” నాట్స్ ” తెలుగు కళా సమితి ”,” టిఎల్సీయే ”, ” తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ” తదితర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి. జగదీశ్ యలమంచిలి ,డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ కార్యక్రమాన్ని JSW , Jaiswaraajya యూట్యూబ్ ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి.