మీరు ఏ సంవత్సరంలో పుట్టారు అనగానే టక్కున ఆంగ్ల సంవత్సరం గురించి చెప్పేస్తారు. కానీ ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో తెలుసా ? అంటే మాత్రం గుడ్లు తేల్చేయడం ఖాయం ఎందుకంటే ఎక్కువ మందికి ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో సరిగ్గా తెలియదు. అలాంటి వాళ్ల కోసమే జై స్వరాజ్య డాట్ టీవీ ఓ చిన్ని ప్రయత్నం చేసింది. మీరు ఎలాగూ ఫలానా ఆంగ్ల సంవత్సరంలో పుట్టిన విషయం తెలుసు కాబట్టి ఆ ఆంగ్ల సంవత్సరాన్ని బట్టి అది ఏ తెలుగు సంవత్సరమో ఇట్టే తెలుసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఆంగ్ల సంవత్సరాన్ని బట్టి మీరు ఏ తెలుగు సంవత్సరంలో జన్మించారో చూసుకోండి.
ఈ ఆంగ్ల సంవత్సరాలలో పుట్టినవాళ్ళు – తెలుగు సంవత్సర పేరు
(1867, 1927, 1987 ) – ప్రభవ
(1868, 1928, 1988) – విభవ
(1869, 1929, 1989) – శుక్ల
(1870, 1930, 1990) – ప్రమోదూత
(1871, 1931, 1991) – ప్రజోత్పత్తి
(1872, 1932, 1992) – అంగీరస
(1873, 1933, 1993) – శ్రీముఖ
(1874, 1934, 1994) – భావ
(1875, 1935, 1995) – యువ
( 1876, 1936, 1996) – ధాత
(1877, 1937, 1997) – ఈశ్వర
(1878, 1938, 1998) – బహుధాన్య
(1879, 1939, 1999) – ప్రమాది
(1880, 1940, 2000) – విక్రమ
( 1881, 1941, 2001) – వృష
(1882, 1942, 2002) – చిత్రభాను
( 1883, 1943, 2003) – స్వభాను
( 1884, 1944, 2004) – తారణ
(1885, 1945, 2005) – పార్థివ
(1886, 1946, 2006) – వ్యయ
( 1887, 1947, 2007) – స్వరజిత్
(1888, 1948, 2008) – సర్వదారి
(1889, 1949, 2009) – విరోది
( 1890, 1950, 2010) – వికృతి
( 1891, 1951, 2011) – ఖర
( 1892, 1952, 2012) – నందన
(1893, 1953,2013) – విజయ
( 1894, 1954, 2014) – జయ
( 1895, 1955, 2015) – మన్మధ
( 1896, 1956, 2016) – దుర్ముఖి
(1897, 1957, 2017) – హేవిళంబి
( 1898, 1958, 2018) – విళంబి
(1899, 1959, 2019) – వికారి
( 1900, 1960, 2020) – శార్వరి
(1901, 1961, 2021) – ప్లవ
( 1902, 1962, 2022) – శుభ కృత్
(1903, 1963, 2023) – శోభ కృత్
( 1904, 1964, 2024) – క్రోది
(1905, 1965, 2025) – విశ్వావసు
(1906, 1966, 2026) – పరాభవ
( 1907, 1967, 2027) – ప్లవంగ
( 1908, 1968, 2028) – కీలక
(1909, 1969, 2029) – సౌమ్య
( 1910, 1970, 2030) – సాదారణ
( 1911, 1971, 2031) – విరోదికృత్
(1912, 1972, 2032) – పరీధావి
( 1913, 1973, 2033) – ప్రమాది
( 1914, 1974, 2034) – ఆనంద
( 1915, 1975, 2035) – రాక్షస
( 1916, 1976, 2036) – నల
(1917, 1977, 2037) – పింగళ
( 1918, 1978, 2038) – కాళయుక్తి
(1919, 1979, 2039) – సిద్దార్థి
( 1920, 1980, 2040) – రౌద్రి
(1921, 1981, 2041) – దుర్ముతి
( 1922, 1982, 2042) – దుందుభి
(1923, 1983, 2043) – రుధిరోద్ఘారి
( 1924, 1984, 2044) – రక్తాక్షి
( 1925, 1985, 2045) – క్రోధన
(1926, 1986, 2046) – అక్షయ
Breaking News