Horoscope Today: మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా తట్టుకుంటారు. మనోబలం బాగుంటుంది. ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన మంచిది.
వ్రషభ రాశి వారికి అనుకూల సమయం. పనుల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఇష్టదేవత ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మిథున రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకుంటారు. రామనామ జపం మంచి చేస్తుంది.
కర్కాటక రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. మనోధైర్యం కలిగి ఉండాలి. వివాదాల జోలికి వెళ్లకండి. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాటకు కట్టుబడి ఉండాలి. హనుమాన్ ఆరాధన శుభాలు కలిగిస్తుంది.
కన్య రాశి వారికి సంతోషకరమైన కాలం. అందరు మీ పట్ల ప్రేమ చూపుతారు. ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు దక్కుతాయి.
తుల రాశి వారికి సంతోషం కలిగించే వార్తలు వింటారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. లింగాష్టకం చదివితే మంచి లాభాలు కలుగుతాయి.
వ్రశ్చిక రాశి వారికి కష్టాలు ఎదురైనా ఎదురు నిలుస్తారు. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అనవసర వివాదాల్లో దూరకూడదు. శ్రీ సూక్తం చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
ధనస్సు రాశి వారికి కొన్ని విషయాలు బాధ కలిగిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. వెంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది.
మకర రాశి వారికి శుభవార్తలు వింటారు. సంతోషం కలుగుతుంది. అధికారుల అండదండలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.
కుంభ రాశి వారికి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో దూకుడు పనికి రాదు. శనిజం చేస్తే మంచి జరుగుతుంది.
మీన రాశి వారికి సమస్యలు లేకుండా చేసుకుంటారు. ప్రయాణాల్లో లాభాలున్నాయి. ధర్మంగా నడుచుకుంటారు. భుజంగస్తవం చదవడం వల్ల మంచి ఫలతాలు వస్తాయి.