39.2 C
India
Thursday, June 1, 2023
More

    Jyeshta Masam : జ్యేష్ట మాసం విశిష్టత ఏంటో తెలుసా?

    Date:

    Jyeshta Masam : తెలుగు వారు పంచాంగాన్ని నమ్ముతారు. మనకు పన్నెండు రాశులు, 27 నక్షత్రాలు, 6 తెలుగు నెలలు ఉంటాయి. ఇందులో చైత్రం మొదటిది కాగా ఫాల్గుణం ఆఖరుది. ఇందులో చైత్రం, వైశాఖం తరువాత వచ్చేది జ్యేష్టం. ఈ మాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జ్యేష్ట మాసంలో చేసే పూజలకు ప్రత్యేకత ఉంటుంది.

    జ్యేష్ట శుద్ధ దశమిని దశపాపహర దశమిగా చెబుతారు. పది రకాల పాపాలను పోగొట్టే దశమిగా భావిస్తారు. ఈ రోజు గంగానదిలో కానీ లేదా ఏదైనా నదిలో కానీ మూడు మునకలు వేయడం ఎంతో పుణ్యం. ఇంకా రజతంతో చేసిన తాబేలు, చేపలు, కప్పలు లాంటి జలచరాల ప్రతిమలు నీళ్లలో వేయడం మంచిది. నల్లనువ్వులు, బెల్లం, పేలపిండి వంటివి నదిలో వేయడం వల్ల పుణ్యం దక్కుతుంది.

    జ్యేష్ట శుద్ధ ఏకాదశిని నిర్మల ఏకాదశి అని కూడా పిలుస్తారు. పాయసం, పానకం, గొడుగు, నెయ్యి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. నిర్మల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే 12 ఏకాదశులకు సరిపడా పుణ్యం వస్తుంది. నదిలో స్నానం చేసినా ఇంట్లో స్నానం చేసినా గంగాదేవిని స్మరించి చేయడం వల్ల మంచి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

    జ్యేష్ట పౌర్ణమి తరువాత పదమూడో రోజున వటసావిత్రి వ్రతం మహిళలు చేస్తుంటారు. భర్తలు పదికాలాల పాటు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యంతో పది కాలాల పాటు బాగుండాలని ఈ వ్రతం చేస్తుంటారు. ఇలా జ్యేష్ట మాసంలో ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం. మనకు పుణ్యం దక్కాలని కోరుకుంటాం. ఇలా మన మాసాల్లో జ్యేష్ట మాసానికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది.

    Share post:

    More like this
    Related

    మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

        టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

    ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

        తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

    అల్లుడితో లేచిపోయిన అత్త..!

          మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

    దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

          వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related