
మేషం:
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని పనులలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగుతాయి.
—————————————
వృషభం:
ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.
—————————————
మిధునం:
వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సంతాన అనారోగ్య విషయంలో సమస్యలుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
—————————————
కర్కాటకం:
చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.
—————————————
సింహం:
దాయదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
—————————————
కన్య:
ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
—————————————
తుల:
ధన వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో వివాదాలు రాజి చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలోలాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.
—————————————
వృశ్చికం:
కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు.
—————————————
ధనస్సు:
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
—————————————
మకరం:
ఉద్యోగాలలో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.
—————————————
కుంభం:
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. మీ ప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
—————————————
మీనం:
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
శనివారం, మార్చి 11, 2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
ఫాల్గుణ మాసం – బహళ పక్షం
తిధి : చవితి రా8.17 వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : స్వాతి పూర్తి
యోగం : ధృవం సా6.38 వరకు
కరణం : బవ ఉ8.20 వరకు
తదుపరి బాలువ రా8.17 వరకు
వర్జ్యం: ఉ11.40 – 1.18 & తె.6.05నుండి
దుర్ముహూర్తము : ఉ6.16 – 7.50
అమృతకాలం : రా9.25 – 11.03
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00
సూర్యరాశి: కుంభం || చంద్రరాశి: తుల
సూర్యోదయం: 6.18 || సూర్యాస్తమయం: 6.04
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు
👉సంకష్ట హర చతుర్ధి👈
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
**