31.7 C
India
Friday, June 14, 2024
More

  మార్చి 20th 2023 రాశి ఫలితాలు

  Date:

  March 20th Monday 2023 Horoscope
  March 20th Monday 2023 Horoscope

  మేషం:

  ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు దీర్ఘకాలిక రుణాలు నుండి విముక్తి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.

  —————————————

  వృషభం:

  ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు.

  —————————————

  మిధునం:

  దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఋణ ఒత్తిడి వలన శిరోభాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

  —————————————

  కర్కాటకం:

  మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

  —————————————

  సింహం:

  అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

  —————————————

  కన్య:

  బంధు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

  —————————————

  తుల:

  ఉద్యోగమున బాధ్యతలు సరిగా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు.

  —————————————

  వృశ్చికం:

  అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

  —————————————

  ధనస్సు:

  అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి ఊహించని ధన సహాయం అందుతాయి.

  —————————————

  మకరం:

  ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. వృత్తి బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

  —————————————

  కుంభం:

  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సంతానం విద్యా విషయాల సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

  —————————————

  మీనం:

  ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృధా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు.

  Share post:

  More like this
  Related

  Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి భారీ షాక్.. పవన్ సినిమాలకు దూరం..!

  Pawan Kalyan : ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు...

  Hyderabad News : ఇంటి అద్దె కోసం వచ్చి.. ఇంటి ఓనర్ పై అపరిచితుల దాడి

  Hyderabad News : హైదరాబాద్ ఉప్పల్ లోని చిలకానగర్ లో ఓ...

  Fake Police : నకిలీ పోలీస్.. రూ. 10 లక్షలు వసూలు

  Fake Police : లగ్జరీ లైఫ్, గుర్రప్పందాలు, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్...

  Jammu Kashmir : జమ్మూకాశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం – విద్యాశాఖ కీలక నిర్ణయం

  Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో రోజూ...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  July 4 Horoscope : నేటి రాశి ఫలితాలు

  July 4 Horoscope :మేష రాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి....

  Horoscope : నేటి రాశి ఫలితాలు

  మేష రాశి వారికి పనుల్లో తొందరపాటు వద్దు. నిదానమే ప్రధానం అన్నట్లుగా...

  Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

    Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష...

  Venus : శుక్ర గ్రహ సంచారంతో ఏ రాశుల వారికి లాభమో తెలుసా?

  Venus : మనకు శుక్రగ్రహ సంచారం వల్ల ఎంతో మేలు కలుగుతుంది....