32.2 C
India
Saturday, April 20, 2024
More

    మార్చి 24 2023 రాశి ఫలితాలు

    Date:

    March 24 2023 Horoscope
    March 24 2023 Horoscope

    మేషం

    పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

    —————————————

    వృషభం

    ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

    —————————————

    మిధునం

    ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

    —————————————

    కర్కాటకం

    విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

    —————————————

    సింహం

    వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు.

    —————————————

    కన్య

    కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

    —————————————

    తుల

    మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. పాత రుణాలు కొన్ని తీర్చాగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

    —————————————

    వృశ్చికం

    కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత ఆశ్చర్య పరుస్తాయి. చాలాకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

    —————————————

    ధనస్సు

    సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి.

    —————————————

    మకరం

    ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు.

    —————————————

    కుంభం

    చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

    —————————————

    మీనం

    కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.

    Share post:

    More like this
    Related

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    July 4 Horoscope : నేటి రాశి ఫలితాలు

    July 4 Horoscope :మేష రాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి....

    Horoscope : నేటి రాశి ఫలితాలు

    మేష రాశి వారికి పనుల్లో తొందరపాటు వద్దు. నిదానమే ప్రధానం అన్నట్లుగా...

    Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

      Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష...

    Venus : శుక్ర గ్రహ సంచారంతో ఏ రాశుల వారికి లాభమో తెలుసా?

    Venus : మనకు శుక్రగ్రహ సంచారం వల్ల ఎంతో మేలు కలుగుతుంది....