27.8 C
India
Sunday, May 28, 2023
More

    మార్చి 28 2023 రాశి ఫలితాలు

    Date:

    March 28th 2023 Horoscope
    March 28th 2023 Horoscope

    మేషం

    ఉద్యోగస్తులకు అదనపు పనిబారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట ఊహించని సమస్యలు పెరుగుతాయి.

    —————————————

    వృషభం

    దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

    —————————————

    మిధునం

    ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఇంటాబయట సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

    —————————————

    కర్కాటకం

    సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

    —————————————

    సింహం

    బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

    —————————————

    కన్య

    కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని మాటపట్టింపులుంటాయి.

    —————————————

    తుల

    ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులకు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ ఉండదు. వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

    —————————————

    వృశ్చికం

    కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

    —————————————

    ధనస్సు

    గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలో ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి.

    —————————————

    మకరం

    వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

    —————————————

    కుంభం

    వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

    —————————————

    మీనం

    ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి

    Share post:

    More like this
    Related

    Surekhavani : మరో పెళ్ళికి సిద్ధం అవుతున్న సురేఖావాణి.. అందుకే అలాంటి ట్వీట్ చేసిందా?

    Surekhavani : ఇప్పుడు పవిత్ర లోకేష్ - నరేష్ ల జంట ఎంత...

    Late Marriages : ఆలస్యంగా పెళ్లిళ్లతో సంతాన సమస్యలు

    late marriages : ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కెరీర్...

    Eating Curd : ఎండాకాలంలో పెరుగు తింటే వేడి చేస్తుందా?

    Eating curd : ఎండాకాలంలో చాలా మంది పెరుగు తింటారు. కానీ...

    President plane : అరెయ్.. ఏంట్రా ఇదీ.. అధ్యక్షుడి విమానంతోనే ఆటలు

    President plane : అది అద్యక్షుడి విమానం. విమానంలో ఆయన లేరు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఈ ఐదు రాశుల వారికి కనక వర్షమే తెలుసా?

    Five zodiac signs : జ్యోతిష్యం ప్రకారం మనకు నక్షత్రాల ప్రకారం...

    శని దేవుడి ప్రసన్నం కోసం ఏం చేయాలో తెలుసా?

    మన జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాశులుంటాయి. ప్రతి రాశిలో శని సంచరిస్తుంటాడు....

    ఏప్రిల్ 18th 2023 రాశి ఫలితాలు

    మేషం చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితుల...

    ఏప్రిల్ 17th 2023 రాశి ఫలితాలు

    మేషం బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు. చేపట్టిన...