మేషం:
దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా
గడుపుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు
వేగవంతం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
—————————————
వృషభం:
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో వివాదాలు కొంత
మానసికంగా చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత
నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు
కలుగుతాయి.
—————————————
మిధునం:
చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట
పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగ వాతావరణం
గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో
పాల్గొంటారు.
—————————————
కర్కాటకం:
భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం
అందుతుంది. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విందు వినోద
కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
—————————————
సింహం:
వృత్తి వ్యాపారాలు మరింత మెరుగైన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ
సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.
—————————————
కన్య:
విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. బంధువర్గంతో వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు,
ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
—————————————
తుల:
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో
అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా
ఉండవు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు వర్గంతో వివాదాలు కొంత బాధిస్తాయి.
—————————————
వృశ్చికం:
ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. గృహ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన
కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు
పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
—————————————
ధనస్సు:
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి
ఒప్పందాలు వాయిదావేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో
చిన్నపాటి సమస్యలు తప్పవు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.
—————————————
మకరం:
వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి
ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
—————————————
కుంభం:
కుటుంబసభ్యులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు
చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త
అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
—————————————
మీనం:
ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో
పురోగతి సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో
మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, మార్చి 8, 2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
ఫాల్గుణ మాసం – బహళ పక్షం
తిథి:పాడ్యమి రా7.11 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తర తె3.56 వరకు
యోగం:శూలం రా9.10 వరకు
కరణం:బాలువ ఉ6.29 వరకు తదుపరి కౌలువ రా7.11వరకు
వర్జ్యం:ఉ9.55 -11.38
దుర్ముహూర్తము:ఉ11.47 – 12.34
అమృతకాలం:రా8.11 – 9.54
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:6.18
సూర్యాస్తమయం:6.04
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻.