
Pisces : ఇంటికి వాస్తు దోషం ఉంటే పనులు జరగవు. కలహాలు వస్తాయి. డబ్బు నిలవదు. దీంతో మనకు చాలా రకాల చిక్కులు ఏర్పడతాయి. రాశి ఆధారంగా ఇంటి యజమానికి ఇంటి వాస్తు చూసుకోవాలి. వాస్తు సరిగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇంటి యజమానికి ఇల్లు అన్ని విధాల అనుకూలంగా ఉంటేనే సంపాదన కలుగుతుంది. లేదంటే ఆర్థికంగా తిప్పలు ఏర్పడతాయి
ఇంట్లో సంపాదించే వ్యక్తి మీన రాశి వారు అయితే కొన్ని మార్పులు చేసుకోవాలి. పక్కా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సమాజంలో మన గౌరవ మర్యాదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. ఇంట్లో హాల్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. అతిథులకు మర్యాద ఇచ్చే గుణం మీన రాశి వారికి ఉంటుంది. అందుకే ఇంటికి వచ్చే వారి కోసం ఇల్లు బాగుండేలా చూసుకోవాలి.
సెంటిమెంట్ కు కూడా విలువ ఇస్తారు. బంధువర్గానికి చేదోడువాదోడుగా ఉంటారు. దీంతో ఇంటికి ఎప్పుడు బంధువులు వస్తూనే ఉంటారు. ఇంట్లో సోఫా ఎల్ ఆకారంలో ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ నేపథ్యంలో మీన రాశి వారికి ఇల్లు ఉండే విధానం బాగుగా చూసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో బాధలు రావడం సహజం. అందుకే ముందుగానే ఇంటిని చక్కదిద్దుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ ప్రధాన ద్వారం ఉండేలా చూసుకోవాలి. ఆగ్నేయ దిశను బాగా ఉంచుకోవాలి. అందరికి ఆగ్నేయం పనిచేయకపోయిన మీన రాశి వారికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తు ఉంచుకోవాలి. దీని వల్ల మనకు శుభం కలుగుతుంది. వీరికి నార్త్ ఫేస్ కూడా బాగుంటుంది. కలిసి వస్తుంది. ఇంటి లేన్ పశ్చిమం నుంచి తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి.
ఇంటి పూజ గదిలో కమలం పూల దండ ఉంచుకోవడం మంచిది. పిడకను కాల్చి ఇల్లంతా పొగ వేసుకోవాలి. ఇంటి ఫ్లోర్ ను సముద్రపు ఉప్పుతో శుభ్రం చేయాలి. దీని వల్ల మనకు బాగా కలిసొస్తుంది. ఇలా మనం చేసే పరిహారాలు మనకు మేలును కలిగిస్తాయి. మీన రాశి వారు తమ ఇంటిని పక్కా వాస్తు ప్రకారం ఉంచుకుని బాధలు లేకుండా చేసుకోవాలి.