వృషభ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఈశ్వర ఆరాధన చేయడం చాలా లాభాలున్నాయి.
మిథున రాశి వారికి శ్రమ పెరుగుతుంది. బాధలు కలిగించే సంఘటనలు జరుగుతాయి. ప్రతి విషయంలో జాగ్ర్తత్తలు తీసుకోవాలి. చంద్రశేఖర అష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శివ పంచాక్షరి మంత్రం జపిస్తే ఉత్తమం.
సింహ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లింగాష్టకం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. ఈశ్వర దర్శనం మంచి లాభాలు కలిగిస్తుంది.
తుల రాశి వారికి మంచి కాలం. బుద్ధిబలంతో ముందుకు వెళతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శివపార్వతుల పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వృశ్చిక రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వరాభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి వారికి పనులు వాయిదా వేసుకోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. విశ్రాంతి అవసరం. బిల్వాష్టకం చదివితే మంచిది.
మకర రాశి వారికి మంచి కాలం. శుభాలు కలుగుతాయి. ఉద్యోగంలో మంచి మార్పులుంటాయి. గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలున్నాయి. ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గురు ధ్యాన శ్లోకం చదివితే మంచి ఫలితాలున్నాయి.
మీన రాశి వారికి ఆలోచించి అడుగులు వేయాలి. పరిధి దాటి ప్రవర్తించకూడదు. పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ ఆరాధన చేయడం మంచిది.