
Buddha : మన ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని పక్కాగా వాస్తు ప్రకారం ఉంటే మన ఇల్లు కళకళలాడుతుంది. ఇలా మన ఇంట్లో అన్ని వస్తువులు పక్కాగా ఉంచుకునేందుకు ఇష్టపడుతుంటాం. ఒకవేళ అన్ని సక్రమంగా లేకపోతే మనకు ఇబ్బందులు రావడం సహజమే. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ఇంట్లో బుద్ధ విగ్రహం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని అందరు నమ్ముతారు. కానీ దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవాలి? వాస్తు పద్ధతులు ఏం పాటించాలి? అనే సందేహాలు వస్తుంటాయి. బుద్ధ విగ్రహాన్ని తూర్పు, లేదా ఉత్తరం, ఈశాన్య దిశల్లో ఉంచుకోవడం మంచిది. కొందరు పూజ గదిలో కూడా ఏర్పాటు చేసుకుని పూజలు కూడా చేస్తారు.
తోట ఉన్న వారు అక్కడ కూడా బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు. బుద్ధుడు ధ్యానం చేసే ఉండే విగ్రహం బాగుంటుంది. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదని చదువుకునే చోట బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బుద్ధుడి విగ్రహం ఉంచుకోవడం శ్రేయస్కరం. బుద్ధుడి విగ్రహం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
విగ్రహం కంటిచూపు కంటే పైనే ఉండేలా చూసుకోవాలి. రిఫ్రిజిరేరటర్, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద విగ్రహం పెట్టుకోకూడదు. అలా పెడితే వైబ్రేషన్ వస్తుంది. స్టోర్ రూం దగ్గర పెట్టుకోకూడదు. బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. బుద్ధుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఎంతో మంచి కలుగుతుందని నమ్ముతుంటారు.