ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని కుదరకపోతే ఇబ్బందులు వస్తాయి. పక్కా వాస్తు చూసుకుని మరీ అన్ని వస్తువులు ఏర్పాటు చేసుకుంటాం. కానీ కొన్ని పొరపాట్లు చేస్తే ఆర్థిక ఇబ్బందులు రావడం ఖాయం. అందుకే వాస్తు దోషాలు పోవాలంటే ఇంట్లో తాబేలు బొమ్మ గానీ చిత్రం కానీ ఉంచుకోవాలి. కానీ అది ఏ దిక్కులో ఉంచుకోవాలో కూడా తెలుసుకుని ఏర్పాటు చేసుకోవడం మంచిది.
తాబేలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా చెబుతారు. దేవుడి దశావతారాల్లో కూర్మావతారం కూడా ఒకటి కావడం గమనార్హం. అందుకే ఇంట్లో తాబేలు బొమ్మ కానీ చిత్రం కానీ ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. తాబేలును ఇంట్లో ఉంచుకోవడం శుభ సూచకంగా భావిస్తాం.
తాబేలును పౌర్ణమి రోజు ఇంట్లోకి తీసుకొస్తే మంచిది. అభిజిత్ ముహూర్తంలో తాబేలును పాలలో ముంచి తీసి మళ్లీ నీళ్లతో శుభ్రం చేసి తరువాత ఒక పాత్రలో నీళ్లు ఉంచి అందులో దాన్ని వేయాలి. ఇలా తాబేలు మన ఇంట్లో ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. దీంతో తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకుని దోషాలు లేకుండా చూసుకోవాలి.
తాబేలును ఈశాన్య దిశలో ఉంచుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే తాబేలును తూర్పు దిశలో ఉంచుకోవాలి. లోహపు తాబేలు ఎప్పుడు నీళ్లల్లో ఉండాలి. దీని వల్ల మనకు బాగా కలిసొస్తుంది. ఇలా వాస్తు దోషాలు పోవాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.