
zodiac signs till July 1 : షడష్టక యోగం కారణంగా ఈ నాలుగు రాశుల వారికి జులై 1 వరకు కష్టాలు ఎదురుకానున్నాయి. జ్యోతిష్యంలో గ్రహాల ఆధారంగా మన భవిష్యత్ నిర్ణయించబడుతుంది. గ్రహాలు తన స్థానాన్ని మార్చుకుంటే మానవాళిపై ప్రభావం పడుతుంది. ఇలా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జాతకంలో 6వ మరియు 8వ ఇంటిలోని ఏదైనా రెండు గ్రహాలు అశుభ యోగాలు కలుగజేస్తాయి.
ధనస్సు రాశి వారికి 8వ ఇంటిలో కుజుడు ఉండటం వల్ల సమస్యలొస్తాయి. మనసులో ఒక రకమైన చికాకు భయపెడుతుంది. దీంతో ఏ పని చేసినా కలిసి రాదు. ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతత దెబ్బతింటుంది. దీంతో వారు ఏ పని చేయడానికి అనుకూలత ఉండదు.
మకర రాశి శుభాలు ఉన్న రాశి. దీంతో ఈ రాశి వారికి కూడా చెడు ప్రభావాలు కలుగుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. వైవాహిక జీవితంలో కష్టాలు రావడం సహజం. దీంతో ఈ రాశి వారు ఏ పని చేయకుండా ఉండటమే మంచిది.
సింహరాశి వారికి కూడా కాలం అంత బాగా లేదు. ప్రతికూల ప్రభావాలే ఎదురవుతున్నాయి. జీవితంపై పెను ప్రభావాలే కలిగించనున్నాయి. సమస్యలు చుట్టుముట్టడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. జులై 1 వరకు ఈ రాశులకు అంత సురక్షితంగా లేదు.
మిథున రాశి వారికి ఇంట్లో కుజుడు ఉండటంతో ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. ఏ పని చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడకూడదు.