
నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దిగ్గజ టీమ్ ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ను ఖతం చేసి సంచలన విజయం సాధించింది. దాంతో నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో 1-0 తో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇన్నింగ్స్ 132 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో భారత్ శుభారంభం చేసింది. జడేజా , షమీ , అక్షర్ పటేల్ తదితరులు బ్యాట్ ఝులిపించారు. ఇక రవీంద్ర జడేజా బ్యాట్ తోనే కాకుండా బౌలింగ్ తో కూడా అదరగొట్టాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా పై భారత్ అద్భుతమైన విజయం సాధించడంతో క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.