
డేవిడ్ వార్నర్ కు.. పేసర్ భువనేశ్వర్ కు మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ సన్ రైజర్స్ కు ఆడారు. డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కు కేప్టెన్ గా ఉండగా.. భువనేశ్వర్ డిప్యూటిగా వ్యవహరించాడు. దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కేప్టెన్ డేవిడ్ వార్నర్, సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మ్యాచ్ లో గెలిచేలా దీవించమని కోరాడు డేవిడ్ వార్నర్. టాస్ అనంతరం భూవీ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కిన వార్నర్ ను భూవీ లేపి కౌగిలించుకున్నాడు. ఈ ఆసక్తికర వీడియో ట్విటర్ వేధికగా ఐపీఎల్ నిర్వాహకులు షేర్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఈ మ్యాచ్ లో తనను ఎట్టి పరిస్థితుల్లో ఔట్ చేయద్దని వార్నర్ భూవీ కాళ్లు మొక్కి వేడుకున్నాడని కొందరు కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ సన్నివేశం అనంతరం వార్నర్ మాట్లాడాడు. తనకు ఈ గ్రౌండ్ అనుబంధం ఉందన్నాడు. ఇక్కడ తనకు అభిమానులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకచ్చాడు వార్నర్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. ఓపెనర్ గా వచ్చిన ఫిల్ సాల్ట్ ను భువనేశ్వర్ డక్ అవుట్ చేశాడు. తర్వాత రెండో వికెట్ నష్టపోయే సరికి ఢిల్లీ క్యాపిట్ 49 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన ముగ్గు బ్యాట్స్ మన్లు కూడా తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. 5 వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే చేసింది ఢిల్లీ క్యాపిటల్. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మనీష్ పాండే-అక్షర్ పటేల్ ఆరో వికెట్ కు 69 రన్స్ జోడించారు. వీరి జోడీని భూవనేశ్వర్ విడదీశాడు.
This visual is all 🧡 💙!
Follow the match ▶️ https://t.co/ia1GLIWu00#TATAIPL | #SRHvDC | @SunRisers | @DelhiCapitals | @BhuviOfficial | @davidwarner31 pic.twitter.com/t9nZ95dyJ7
— IndianPremierLeague (@IPL) April 24, 2023






