భారతదేశంలో క్రికెట్ దేవుడు అంటే టక్కున చెప్పే పేరు సచిన్ టెండూల్కర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు సచిన్ ను దేవుడు గా కీర్తిస్తారు. మిగతా జనాల లాగే స్టార్ హీరో సూర్య కూడా సచిన్ కు వీరాభిమాని. దాంతో సచిన్ ను కలిసిన సందర్భంగా ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సచిన్ టెండూల్కర్ తో చాలా మర్యాద ఇస్తూ ఫోటో దిగాడు సూర్య. ఆ ఫోటో చూసిన నెటిజన్లు సూర్య ఇస్తున్న గౌరవానికి ఫిదా అవుతున్నారు.
సూర్య స్టార్ హీరో అయినప్పటికీ కెరీర్ చట్రంలో ఇరుక్కోకుండా అన్ని రకాల పాత్రలను పోషించి విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. జయాపజయాలను లెక్క చేయకుండా విభిన్న పాత్రలను పోషిస్తూనే ఉన్నాడు. ఇక సచిన్ ను ఎప్పుడు ? ఎక్కడ ? కలిసింది చెప్పలేదు కానీ సచిన్ అంటే తనకు ఎంత గౌరవమో ఈ ఫోటోతో చెప్పకనే చెప్పాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు ఈ ఫోటో చూసి ఫిదా అవుతున్నారు. లైక్ , షేర్ , రీ ట్వీట్ లతో మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
సచిన్ టెండూల్కర్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ ఈ కార్ రేసింగ్ పోటీల సందర్భంగా వచ్చాడు . బహుశా అప్పుడు ఈ ఇద్దరూ ఇలా ఫోటోలు దిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సూర్య తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా పాపులర్ హీరో అనే విషయం తెలిసిందే. ఇక్కడ కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది.
Sach(in) an honour meeting you sir! அன்பும் மரியாதைகளும் 🙂 https://t.co/PdPbMEmSEG
— Suriya Sivakumar (@Suriya_offl) February 16, 2023