
ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో భారత్ సంచలన విజయం సాధించింది. ముంబై లోని వాంఖడే స్టేడియంలో మొదటి వన్డే జరుగగా తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. అయితే గతకొంత కాలంగా ఫామ్ లో లేని కె.ఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో 75 పరుగులు చేసి వెన్నెముకగా నిలిచాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ 91 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక రాహుల్ కు అండగా నిలిచాడు జడేజా. 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు జడేజా. దాంతో మూడు వన్డేల సిరీస్ లో 1- 0 తో ఆధిక్యం సాధించింది.