
ఈనెల 19 న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ఇండియా – ఆస్ట్రేలియా ల మధ్య రెండో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఆ రెండో వన్డే టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రెండో వన్డే టికెట్లు అలా ఆన్ లైన్ లో పెట్టడమే ఆలస్యం ఇలా అన్నీ బుక్ అయిపోయాయి. విశాఖపట్టణంలోని YSR ACA VDCA స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈనెల 19 న ఆదివారం కూడా కావడంతో మ్యాచ్ టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
70 శాతం టికెట్లు పేటీఎం సంస్థ ఆన్ లైన్ లో అమ్మకాలు సాగించింది. 600 నుండి 6 వేల వరకు అమ్మకాలు సాగించింది. ఇక మిగిలిన 30 శాతం టికెట్లలో కొన్ని VIP , VVIP లకు కేటాయిస్తున్నారు. అందులో కూడా కొన్ని అమ్మకానికి పెట్టారు. భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విల్లూరుతున్న అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు దాంతో హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి టికెట్లన్నీ. ఈనెల 17 న మొదటి వన్డే ముంబై లో జరుగనుంది. రెండో వన్డే వైజాగ్ లో జరుగనుంది. ఇక మూడో వన్డే ఈనెల 22 న చెన్నై లో జరుగనుంది.