
రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలయ్యింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఈరోజు విశాఖపట్టణంలో రెండో వన్డే జరిగింది. భారత్ మొదట బ్యాటింగ్ చేయగా కేవలం 26 ఓవర్లలోనే ఆలౌట్ అయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు దాంతో దారుణమైన స్కోర్ నమోదు చేసారు. ఏ బ్యాట్స్ మెన్ కూడా రాణించలేకపోయాడు దాంతో 117 పరుగులు మాత్రమే చేయగలిగారు.
ఇక 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇద్దరు ఓపెనర్లు మిచెల్ మార్ష్ ( 36 బంతుల్లో 66 ) ట్రావిస్ హెడ్ ( 30 బంతుల్లో 51 ) పరుగులతో విధ్వంసం సృష్టించారు. వికెట్ నష్టపోకుండా భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. 11 ఓవర్లు వేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దాంతో మూడు వన్డేల సిరీస్ ను 1-1 తో సమం చేసింది ఆస్ట్రేలియా. దాంతో మూడో వన్డే భారత్ – ఆస్ట్రేలియా లకు కీలకం కానుంది.