
న్యూజిలాండ్ తో మూడు టి 20 మ్యాచ్ లలో భాగంగా నిన్న జరిగిన రెండో టి 20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మొదటి టి 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించగా రెండో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దాంతో మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచాయి . ఇక మూడో టి 20 మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారిదే టైటిల్. దాంతో మూడో టి 20 మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది. భారత్ బౌలర్ల ధాటికి కివీస్ కుప్పకూలింది. 100పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆపసోపాలు పడి విజయం సాధించింది. కివీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. అయితే సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో విజయం భారత్ వశమైంది.