
అహమ్మదాబాద్ లో జరిగిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో భారత్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం నమోదు చేసింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో వరుసగా మొదటి రెండు టెస్ట్ లలో సంచలనం సృష్టించి విజయం సాధించి 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోగా మూడో టెస్ట్ లో మాత్రం భారత్ ఘోర ఓటమి చవిచూసింది. దాంతో ఆస్ట్రేలియా కూడా లీడ్ లోకి వచ్చింది. ఇక కీలకం అయిన నాలుగో టెస్ట్ లో మొదట ఆస్ట్రేలియా విజృంభించినప్పటికీ తర్వాత భారత్ బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియాను కట్టడి చేయగలిగారు.
అయితే మ్యాచ్ చివరి రోజు వరకూ ఎలాంటి ఫలితం తేలకపోవడంతో నాలుగో టెస్ట్ డ్రా అయ్యింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2 – 1 ఆధిక్యంతో సిరీస్ సొంతం చేసుకుంది. దాంతో బోర్డర్ – గవాస్కర్ 2023 ట్రోఫీ భారత్ వశమైంది. రోహిత్ సేన ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.