
నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో T 20 మ్యాచ్ లో భారత్ సంచలన విజయం సాధించింది.. న్యూజిలాండ్ పై 168 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేయగా 235 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 66 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో భారీ విజయం భారత్ సొంతమైంది. మూడు టీ 20 మ్యాచ్ లలో భారత్ 2- 1 తో న్యూజిలాండ్ ని ఓడించింది. దాంతో సిరీస్ భారత్ వశమైంది.