బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2023 కప్ కోసం ఆస్ట్రేలియా – భారత్ నాలుగు టెస్ట్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ లు జరుగగా 2 టెస్ట్ మ్యాచ్ లను భారత్ గెలువగా ఒక టెస్ట్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. దాంతో ఈ నాలుగో టెస్ట్ కీలకంగా మారింది. ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ భారత్ వశం అవుతుంది. ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. దాంతో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించనున్నాయి.
ఇక ఈ నాలుగో టెస్ట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భారత ప్రధాని నరేంద్ర మోడీ – ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్. భారత్ – ఆస్ట్రేలియా ల మధ్య అనుబంధానికి 75 ఏళ్ళు పూర్తి అవుతుండటంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని మోడీ , ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ హాజరయ్యారు. ఆటగాళ్లను కలిసి అభినందించారు. అలాగే అహమ్మదాబాద్ లోని స్టేడియంలో తిరుగుతూ ప్రేక్షకులను అలాగే ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తుండగా భారత్ బౌలింగ్ చేయనుంది.