Talibans Restrictions: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బలమైన జట్లను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. దిగ్గజ జట్లను ఓడించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆ జట్టు క్రికెట్ కు దూరంగా కాబోతున్నది. అయితే ఇది మ్యాచ్ లో చేసిస తప్పిదాలో లేక, ఐసీసీ విధించిన నిబంధనో కాదు. ఆ దేశ ప్రభుత్వం. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. తాలిబన్లు తమ దేశంలో క్రికెట్‌ను పూర్తిగా నిషేధించేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన మాత్రం రాలేదు. కానీ తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తమ దేశంలో క్రికెట్‌ను నిషేధించాలని ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం క్రికెట్ క్రీడ తమ దేశంలో చెడును ప్రోత్సహిస్తున్నదని, అలాగే ఈ ఆట షరియా చట్టానికి విరుద్ధమని, అందుకే ఈ క్రీడను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు తాలిబన్ల సుప్రీం హిబతుల్లా అఖుంద్జాదా తమ నేతలతో చెప్పినట్లు సమాచారం.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అనేక మార్పులు జరిగాయి. ముందుగా తాలిబాన్ ప్రభుత్వం మహిళల క్రికెట్, మహిళలు పాల్గొనే అన్ని ఇతర క్రీడలపై నిషేధం విధించింది. ఇప్పుడు మెన్స్ క్రికెట్ పైనా నిషేధం విధించాలని యోచిస్తున్నది. తాలిబాన్ ప్రభుత్వం జారీ చేసిన అంతర్గత ఆదేశాలతో క్రికెట్ ప్రపంచంలో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో పైప ఆఫ్ఘన్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నది. ప్రభుత్వం విధించిన ఈ నిషేధాన్ని ఎప్పుడు, ఎలా అమలు చేస్తారనే విషయంలో ఇప్పటికైతే స్పష్టత లేదు.
ఇండియా టూర్ ఆఫ్ఘన్ జట్టు
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నది. న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడం, మైదానం సరిగా లేకపోవడంతో ఈ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌ను రద్దు చేయడంతో రెండు జట్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇంతలో తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆఘ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేయర్లను మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.