
విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను నమోదు చేసాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్ లో 25000 పరుగులను పూర్తి చేసి సచిన్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు కింగ్ కోహ్లీ. 577 ఇన్నింగ్స్ లలో సచిన్ 25000 పరుగులను పూర్తి చేయగా కోహ్లీ మాత్రం 549 ఇన్నింగ్స్ లోనే ఈ అరుదైన ఫీట్ సాధించడం విశేషం.
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు కోహ్లీ. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం సాధించింది. దాంతో మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో 2-0 ఆధిక్యం సాధించి భారత్ ముందంజలో ఉంది. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 25000 పరుగులను సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇక పలువురు ప్రముఖులు కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.