40 ఏళ్ల గృహిణి పవర్ లిఫ్టర్ గా కొత్త అవతారం ఎత్తింది. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన 40 ఏళ్ల మహిళ ” మాసిలామణి ” ఓ సాధారణ గృహిణి. అయితే తన ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏదైనా సాధించాలని అనుకుంది. అయితే 40 ఏళ్ల వయసులో జిమ్ కు వెళ్లి బాగా కసరత్తులు చేసి పవర్ లిఫ్టింగ్ లో సంచలనం సృష్టించింది. తన 17 ఏళ్ల కూతురు ధరణిని కూడా పవర్ లిఫ్టర్ గా మార్చింది.
తనతో పాటుగా కూతురు ధరణిని కూడా జిమ్ కు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు తమిళనాట మాసిలామణి మాత్రమే కాకుండా ఆమె కూతురు ధరణి కూడా పవర్ లిఫ్టర్ గా మారారు.