అందాల భామ ఏస్తర్ నోరాన్హా ఓ కన్నడ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇనాందార్ అనే కన్నడ సినిమాలో ఈ భామ చేత ఐటమ్ సాంగ్ చేయించారు. ఇక ఏస్తర్ కూడా ఎక్కడా తగ్గకుండా అందాలన్నీ బహిర్గతం చేస్తూ చాలా కష్టపడింది. అసలే భారీ అందాల భామ కావడంతో ఈ భామ అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి అంతగా రెచ్చిపోయింది.
ఏస్తర్ తెలుగులో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 1000 అబద్ధాలు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతో సినీల్ సరసన భీమవరం బుల్లోడు చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా కూడా అట్టర్ ప్లాప్ కావడంతో పాపం ఈ భామకు పెద్దగా అవకాశాలు లభించలేదు. దాంతో కొన్ని చిత్రాల్లో చిన్నా చితక వేషాలు వేసింది.
ఇక ఇదే సమయంలో సింగర్ నోయల్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాది తిరక్కుండానే ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి ఈ భామ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే ఇలా గ్లామర్ పాత్రలు మాత్రమే వస్తున్నాయి. ఏస్తర్ సాలిడ్ అందాల భామ కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి ఆఫర్లు మాత్రమే ఇస్తున్నట్లున్నారు.