లక్ష పుష్పాలతో గణపతి ప్రతిమను రూపొందించారు. ఈ విశిష్ట సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. బెంగుళూరు శంకరపురం లోని శ్రీ శంకర మఠంలో ఈ అద్భుత సౌందర్యం సాక్షాత్కరించింది. లక్ష పుష్పాలతో 25 అడుగుల ఎత్తులో గణపతి ప్రతిమను రూపొందించడంతో ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు.
గణపతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతుండటంతో తమ ప్రత్యేకత ఉండాలని భావించిన శ్రీ శంకర మఠం నిర్వాహకులు ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.