
ముస్లిం దేశమైన ఒమన్ లోని మస్కట్ లో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం కానీ దేశంలో కొంతమంది గుడికి రావడమే గగనం అలాంటిది మస్కట్ లోని గుడికి వేలాది మంది భక్తులు తరలి రావడం సంచలనంగా మారింది. కిలోమీటర్ల పొడవునా బారులు తీరిన భక్తుల కోలాహలంతో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున భారతీయులు హాజరు కావడం విశేషం. ఇక ఈ కల్యాణ మహోత్సవం కోసం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు విచ్చేయడం మరో విశేషం.