
మేము లాయర్లం …… ఇలాగే చేస్తాం ….. మాకు ఎదురు చెబుతావా ? అంటూ ఓ యువకుడు ఓ యువతి ముంబై లోకల్ ట్రైన్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కాగా ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అది వైరల్ గా మారింది. సంఘటన వివరాలలోకి వెళితే…… ముంబై లోకల్ ట్రైన్ లో యువతీయువకులు ఇద్దరు కూడా తమ తమ సీట్లలో కూర్చున్నారు. అయితే ఎదురుగా ఉన్న సీట్లపై ఆ యువతి కాళ్ళు పెట్టింది.
ఇదేంటి కాళ్ళు పెడుతున్నావ్ ….. తీసేయ్ ….. మేము కూర్చోవాలి కదా అని సదరు ప్రయాణీకులు అంటే మేము లాయర్లం …… ఇలాగే పెడదాం….. మా ఇష్టం అంటూ రుబాబు చేశారు. కాళ్ళు తీయాలని ఎంతగా మొత్తుకున్నా ఆ యువతీయువకులు వినలేదు సరికదా ఇంకా ఎక్కువ వేషాలు వేశారు. దాంతో ఆ తతంతమంతా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఇక మేము లాయర్లం ….. అంటూ ఇష్టారీతిన వ్యవహరించిన యువతీయువకులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mumbai local train: ‘We are lawyers’ pic.twitter.com/cCcguA9pYE
— Anshul Saxena (@AskAnshul) February 3, 2023