కవితకు కాదేదీ అనర్హం అన్నారు కానీ ఇప్పుడు కాలం మారింది……… ఫ్యాషన్ కు కాదేదీ అనార్హం అంటోంది యువత. ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకుంటే అయ్యో……. పేదోళ్ళు……. డబ్బులు లేక కొత్త బట్టలు కొనుక్కోలేక చిరిగిన బట్టలు వేసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళు. కానీ కాలం మారింది కదా నేడు అదే ఫ్యాషన్ అయ్యింది. ఎక్కడ బడితే అక్కడ చింపేసి టోర్న్ జీన్స్ అని అంటున్నారు. అదే కాదు ఇంకా చాలా రకాల వైపరీత్యాలకు పోతున్నారు……. ఫ్యాషన్ పేరిట.
ఇక ఈ ఫ్యాషన్ ఎంతగా కొత్త పుంతలు తొక్కిందంటే…… మనకు పెద్ద పెద్ద బియ్యం సంచులు ఉంటాయి కదా…… ఆ సంచులను గ్రామాల్లో బియ్యం ఖాళీ అయ్యాక వర్షాకాలంలో పేద వాళ్ళు గొడుగు కొనుక్కునే స్థోమత లేక వర్షం నుండి కాపాడుకోవడానికి ఈ బియ్యం సంచులను గొడుగుగా చేసుకొని వెళ్తుంటారు. అలాగే పాతవి అయ్యాక, చిరిగిపోయాక కాళ్లు తుడుచు కోవడానికి గుమ్మం ముందు వాడుతుంటారు. కానీ ఇది ఫ్యాషన్ యుగం కదా …… అందుకే అందమైన భామలు ఈ బియ్యం సంచులను లాంగ్ ఫ్రాక్ లాగా రకరకాల డిజైన్ లతో వాడుతున్నారు. అందుకు ఉదాహరణగా పై ఫోటో చూడొచ్చు. అందాల ముద్దుగుమ్మలు బియ్యం సంచులను ఇలా ఫ్యాషన్ పేరిట వాడిన విధానానికి ఫిదా అవుతున్నారు. అందుకే బియ్యం సంచులను పనికి రావని పారేయ్యకుండా ఇలా వాడుకోండి…….. సరికొత్త ఫ్యాషన్ ను ఆస్వాదించండి.