సెప్టెంబర్ 5వ తేదీన ‘ఉపాధ్యాయ దినోత్సవం’ ‘టీచర్స్ డే’ సందర్భంగా మా “గాన కోకిల గాన గంధర్వ మ్యూజికల్ పేజీ” ద్వారా గురతుల్యులైన గౌరవనీయులైన ‘శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్’ గారికి మనందరి తరఫున నమస్కార సత్కారాలు చేయుచు….
ఆ నాటి ఒక విశేషమైన సందర్భ జ్ఞాపకాల సమాహారాన్ని ప్రత్యేకంగా మీ కోసం అందిస్తున్నాము…
ఆనాటి కాలంలో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి తమిళనాడు ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం గౌరవ సత్కారం చేయతలచి మద్రాసు (చెన్నై)నగరంలో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ప్రముఖ కొందరు తమిళ సినిమా ప్రముఖులకు ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానం అందుకున్న వారిలో పి. సుశీలమ్మ, జయలలిత, శివాజీ గణేశన్ లాంటి వారు ఉన్నారు.
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సన్మాన సభలో వారిపై ‘స్వాగత గీతాన్ని ‘ ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ తమిళ పాటను కంపోజ్ చేయగా సుశీల గారిచే స్వయంగా పాడించారు. అయితే ఆ సభలో ‘సర్వేపల్లి’ వారి గౌరవార్థం ‘జయలలిత’ గారు శ్రావ్యంగా సుశీలమ్మ పాడే పాటకు అందంగా నృత్యాన్ని ప్రదర్శించారు.
ఆ సత్కరం పూర్తి అయిన పిమ్మట సుశీలమ్మ, జయలలిత, శివాజీ గణేశన్ గార్లు పాద నమస్కారాలు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్’ గారికి చేసారు. సర్వేపల్లి వారికి సుశీల గారు పాడే విధానానికి సంతోషపడి పులకించి పోయారు. ‘అమ్మా నల్లా పాడిక్కిరేన్ ఉంగళ్ కురళ్ మైక్కవుమ్ మెల్లిసై…’ (అమ్మా చాలా బాగా పాడావు, నీ గాత్రంలో మాధ్యుర్యం ఉంది) అన్నారు.