
చైనాలో తీవ్ర భూకంపం సంభవించింది దాంతో 46 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం ఈ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 46 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. భూపంక తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. అసలే కరోనా తీవ్రత తో చైనా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలోనే భూకంపం రావడంతో తీవ్ర భయాందోళనకు లోనౌతున్నారు.