39.9 C
India
Tuesday, April 21, 2026
More

    చికెన్ మంచూరియా పై సోషల్ మీడియాలో లొల్లి

    Date:

    social media war on chicken manchurian 
    social media war on chicken manchurian

    దక్షిణ భారతదేశంలో చికెన్ మంచూరియా చాలా ఇష్టమైన వంటకం. గ్రామీణ ప్రాంతాలను వదిలేస్తే పట్టణాలలో అలాగే నగరాలలో చికెన్ మంచూరియా హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంది. చూడటానికి మాత్రమే కాకుండా రుచి కూడా నోరూరించేలా ఉండటంతో ఈ వంటకానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. సాధారణంగా చికెన్ అంటేనే ఇష్టం అందునా చికెన్ తో మంచూరియా అంటే మరింతగా ఆసక్తి చూపిస్తున్నారు ….. లొట్టలు వేసుకుంటూ తింటారు.

    అయితే ఈ చికెన్ మంచూరియా పాకిస్థాన్ వంటకమా ? ఇండియా వంటకమా ? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. భారత్ వంటకమని కొందరు వాదిస్తుంటే లేదు ….. లేదు పాకిస్థాన్ వంటకం అంటూ మరికొందరి వాదన. అయితే ఇండియా వంటకం లేదా పాకిస్థాన్ వంటకం అనే విషయాన్ని పక్కన పెడితే దీన్ని ఫేమస్ చేసింది మాత్రం చైనా సంతతికి చెందిన వ్యక్తి. చైనా సంతతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతడు పుట్టింది మాత్రం భారత్ లోనే. నెల్సన్ వాంగ్ అనే వ్యక్తి కోల్ కతా లో జన్మించాడు. ఇతడే చికెన్ మంచూరియా రుచిని  ప్రపంచానికి చాటి చెప్పింది.

    ఒకప్పుడు చికెన్ మంచూరియా వంటకం మాత్రమే ఉండేది. అయితే మాంసాహారులకు చికెన్ మంచూరియా ఇష్టమైన వంటకం అయిపొయింది. దాంతో శాకాహార ప్రియుల కోసం స్వల్ప మార్పులతో వెజ్ మంచూరియా కూడా ఫేమస్ అయ్యింది. అయితే చికెన్ మంచూరియాను మాత్రం ప్రపంచానికి తెలియజేసింది భారత్ లో జన్మించిన చైనా సంతతి వ్యక్తి నెల్సన్ …… కానీ సోషల్ మీడియాలో మాత్రం పాక్ అని కొందరు అంటుంటే …… భారత్ వంటకం అంటూ వాదించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related