నేడు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాష కనుమరుగు అవుతున్న ఈరోజుల్లో మాతృభాష యొక్క గొప్పతనం గురించి పలువురు సామాజిక పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రజలను , ముఖ్యంగా యువతను ఉత్తేజితులను చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు తెలుగు భాష ప్రేమికులు. ఈరోజు గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు గిడుగు రామ్మూర్తి. ఆయన తెలుగు భాషాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. అందుకే ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నాం.
కాన్వెంట్ స్కూల్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్లంతా ఆంగ్ల భాషకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు చెప్పాలంటే తెలుగు రాయడం పక్కన పెడితే తెలుగు చదవడం రాని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈరోజుల్లో. ఒకవేళ తెలుగు మాట్లాడినప్పటికీ తెలుగు అక్షర మాల గురించి తెలియని వాళ్లే ఎక్కువగా ఉన్నారు దాంతో తెలుగు భాష గొప్పతనం గురించి ఆ మాధుర్యం గురించి చాటి చెబుతూనే ఉన్నారు పలువురు. పరాయి భాష నేర్చుకోవాల్సిందే కానీ తెలుగు భాషని పక్కన పెట్టడం మాత్రం క్షమించరాని నేరం. అందుకే భావి తరాల కోసం ……. తెలుగు భాష పటిష్టత కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి మహనీయులకు శతకోటి వందనాలు పలుకుతోంది జైస్వరాజ్య డాట్ టీవీ.