
టర్కీలో ఘోర భూకంపం సంభవించింది దాంతో 1400 మందికి పైగా మరణించినట్లు , మృతుల సంఖ్య మరింతగా పెరగనునట్లు స్పష్టం చేసారు అధికారులు. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. నిద్రలోనే వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి దాంతో శిథిలాల కింద పెద్ద ఎత్తున ఉన్న ప్రజలను కాపాడటానికి రెస్క్యూ సిబ్బంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.