క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్ధిక కష్టాల్లో ఉన్నాడు. 90 వ దశకంలో క్రికెట్ ఆడటంతో బీసీసీఐ నుండి ప్రతీనెలా 30 వేల పెన్షన్ మాత్రమే వస్తోంది ఈ క్రికెటర్ కు. అయితే ముంబైలో నెలకు 30 వేలతో బ్రతకడం కష్టం కాబట్టి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని మీడియా ముందుకు వచ్చి వేడుకుంటున్నాడు.
సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు నాకు చాలాసార్లు సహాయం చేసాడు. అలాగే ఉద్యోగం కూడా ఇప్పించాడు. అయితే ఆ ఉద్యోగం చేయడానికి నేను చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అందుకే సచిన్ ఇప్పించిన ఉద్యోగాన్ని వదులుకున్నాను. నేను నివాసం ఉండే దగ్గరలో ఏదైనా ఉద్యోగం బీసీసీఐ ఇస్తే ఆ జాబ్ చేసుకుంటూ బ్రతుకుతాను అంటూ తన దీనగాథ వెల్లడించాడు వినోద్ కాంబ్లీ. సచిన్ తో పాటుగా క్రికెట్ లోకి అడుగుపెట్టిన కాంబ్లీ కెరీర్ తొలినాళ్లలో విజృంభించి ఆడాడు. అయితే అచిర కాలంలోనే ఫామ్ కోల్పోయి క్రికెట్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు.
Breaking News