మంకీ పాక్స్ పేరును మార్చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) . అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశమైన WHO చివరకు ” ఎంపాక్స్ ” అని పిలవాలని ప్రపంచ దేశాలను కోరింది. అయితే కొంతకాలం పాటు ఈ పేరును మంకీ పాక్స్ పేరుతోనే పిలవనున్నారు …… ఆ తర్వాత ఎంపాక్స్ అనే పేరుతోనే పిలవనున్నారు.
అయితే మంకీ పాక్స్ పేరు ఎంపాక్స్ గా మార్చడానికి కారణం ఏంటో తెలుసా ……. మంకీ పాక్స్ అనే పేరును జాత్యహంకారానికి కొంతమంది వాడుతున్నారు. అంతేకాదు పలువుర్ని ర్యాగింగ్ చేయడానికి మంకీ పాక్స్ అంటూ ఉదహరిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యిందట. దాంతో పలువురితో చర్చించిన తర్వాత మంకీ పాక్స్ ను ఎంపాక్స్ గా మార్చారు అదన్న మాట అసలు విషయం.