మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత తల్లిగా అత్తను చూస్తారు. కానీ ఇక్కడో ప్రబుద్ధుడు అత్తనే ప్రేమించాడు. భార్యను వద్దనుకొని అత్తతో చెక్కేశాడు. విషయం తెలుసుకున్న భార్య, మామ అవాక్కయ్యారు. ఇన్నాళ్లు తాము కళ్లు మూసుకున్నామనుకొని నాలుక కరుచుకున్నారు. ప్రస్తుతం వారు ఆమెరికాలో జల్సా చేస్తుండడంతో వారిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు కష్టాలు పడుతున్నారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన రాజస్తాన్ లోని సిరోహి జిల్లాలో జరిగింది. తన కూతురితో పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయాడు అల్లుడు. అక్కడే కూతురు, అల్లుడు కాపురం పెట్టారు. వారి కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గా అల్లుడు కూతురితో అత్తారింటికి వచ్చాడు. దీంతో అత్తను లేపుకపోవాలని ప్లాన్ వేశాడు. ఈ విషయం అత్తకు కూడా చెప్పారు.
ఇంకేముంది అత్త ప్లాన్ ను సిద్ధం చేసింది. గాయపర్చడం, బంధించడం లాంటివి చేస్తే ప్లాన్ బెడిసి కొడుతుందని భావించి వంటింటి నుంచే ఎత్తు వేసింది. అల్లుడు-కూతురు వచ్చారని చికెన్, మటన్ తెప్పించింది. రెండింటినీ ఆమే దగ్గరుండి వండింది. అయితే మటన్ లో నిద్రమాత్రలు కలిపింది. ఇక అందరూ కూర్చొని తినడం ప్రారంభించాక మటన్ కూతురు, భర్తకు వడ్డించింది. చికెన్ మాత్రం తను, అల్లుడికి వేసింది. దీంతో మటన్ తిన్న కూరుతు, భర్త నిద్రలోకి జారుకున్నారు. దీనికి తోడు లంచ్ చేస్తూ అల్లుడు మామకు మద్యం కూడా తాగించాడు. ఇక వారిద్దరూ మంచి నిద్రలోకి జారుకున్నాక అల్లుడూ అత్త కలిసి పారారయ్యారు.
నిద్రమత్తు నుంచి బయట పడ్డ తర్వాత కూతరు భర్త కోసం, తండ్రి భార్య కోసం వెతకడం ప్రారంభించారు. వారు కనిపించలేకపోవడంతో ఆరా తీశారు. దీంతో వారిద్దరూ లేచిపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశాడు సదరు భర్త. వీరిద్దరి మధ్య ఎప్పుడు ప్రేమాయణం నడిచిందో ఇటు తండ్రికి అటు కూతురుకు తెలియలేదు. పైగా వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా దాదాపు 13 సంవత్సరాలు ఉంది. అమెరికా వెళ్లిన వారిని రప్పించేందుకు పోలీసులు చూస్తున్నారు.