24 C
India
Saturday, September 12, 2026
More

    ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

    Date:

     

     

    తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్ స్టార్ కృష్ణను సీనియర్ నరేశ్ గుర్తు చేసుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా కృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయనతో గడిపిన రోజులను నరేశ్ గుర్తు చేసుకున్నారు. కృష్ణ చివరి దశలో నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతితో కాకుండా పవిత్ర లోకేశ్ తో డేటింగ్ లో ఉన్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి కృష్ణను డిన్నర్ కు పిలిచి మర్యాదలు చేసినప్పటి ఫొటోలను నరేశ్ తన అభిమానులతో పంచుకున్నారు.

    టాలీవుడ్ సినిమాకు ఆయన సేవలను నరేశ్ మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘గ్రేటెస్ట్, ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణను జయంతి సందర్భంగా గుర్తుచేసుకుందాం. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవ రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తుంది. ఆయన ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయి’ అని నరేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఫొటోలు కూడా అటాచ్ చేశారు. రెండు ఫొటోల్లో నరేశ్ పవిత్రా లోకేశ్ కనిపిస్తారు. నరేశ్ పెద్ద కొడుకు నవీన్ కూడా ఈ ఫొటోల్లో ఉన్నాడు. విజయ నిర్మిల చినపోయిన తర్వాత తీసిన ఫొటోలు కావచ్చు. ఒక ఫొటోలో పవిత్రా లోకేశ్ దగ్గరుండి కృష్ణకు వడ్డిస్తున్నారు. పక్కన నరేశ్ నిలబడి చూస్తున్నారు.

    నరేశ్ తల్లి విజయనిర్మలను సూపర్ స్టార్ కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. నానక్‌రాంగూడలోని విజయ నిర్మల నిర్మించుకున్న విజయ కృష్ణ నిలయంలోనే వీరు ఉండేవారు. నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతి, చిన్న కొడుకుతో ఉండేవారు. 2019, జూన్ 27న విజయనిర్మల మరణించారు. తర్వాత కృష్ణను నరేశ్ ప్రేమగా చూసుకునేవారు.

    నాలుగు దశాబ్ధాలకు పైగా తన నటనా ప్రస్తానాన్ని కొనసాగించారు సూపర్ స్టార్ కృష్ణ. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఆయన. టాలీవుడ్ ఉన్నంత కాలం గుర్తుంచుకునేలా అనేక సినిమాలు తీశారు ఆయన
    హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన రాణించారు. 1942, మే 31న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించారు ఆయన. అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. సినిమాలపై మక్కువతో మద్రాసు వెళ్లిన కృష్ణ 1964కు ముందు చిన్న, చిన్న పాత్రల్లో మాత్రమే కనిపించారు.

    1965లో వచ్చిన ‘తేనెమనసులు’తో హీరోగా పరిచయం అయ్యారు. తన మూడో సినిమా ‘గూఢచారి-116’తో టాలీవుడ్ లో క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హవా కొనసాగుతున్న రోజుల్లోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ వారికంటే ఒక అడుగు ముందే ఉంటూ వస్తున్నారు ఆయన. 1983లో హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియోస్ నెలకొల్పారు. ఈ బ్యానర్‌పై తన తమ్ముడు ఆదిశేషగిరిరావును నిర్మాతగా పెట్టి సినిమాలు తీశారు. తన కెరీర్‌లో 340కి పైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణ ఆఖరిగా ‘శ్రీశ్రీ’ చిత్రంలో కనిపించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...