26.5 C
India
Tuesday, October 8, 2024
More

    మే బాక్స్ ఆఫీస్ రివ్యూ: స్ట్రయిట్ చిత్రాలకంటే డబ్బింగే హిట్లుగా నిలిచాయి..

    Date:

     

     

     

    వేసవిని టాలీవుడ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ సారి వేసవిలో డబ్బింగ్ సినిమాలే అగ్రస్థానంలో నిలవగా.. స్ట్రయిట్ సినిమాలు ఒకటి రెండు మినహా సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఈ సారి పెద్ద దెబ్బ తగిలిదంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెల సినిమాల రివ్యూను ఇక్కడ చూద్దాం..

    మే మొదటి వారంలో అల్లరి నరేష్ నటించిన ‘ఉగ్రం’, గోపీచంద్ ‘రామబాణం’ విడుదలయ్యాయి. రెండు సినిమాలు బడ్జె్ట్ కారణంగా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘ఉగ్రమ్’ మొదట్లో హడావిడి చేసినా క్రమ క్రమంగా క్రేజ్ తగ్గూతూ వస్తోంది. కమెడియన్ గా ఉన్న అల్లరి నరేశ్ ను సీరియస్ కాప్‌గా చూపించడం వల్లే ఈ సినమా వేగంగా కనుమరుగైందని  డిస్ట్రిబ్యూటర్లు, వీక్షకులు అసంతృప్తికి గురయ్యారు.

    ఇక ‘రామబాణం’ విషయానికొస్తే, ఇది ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొంది. రొటీన్ కంటెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పూర్తిగా పక్కకు చెట్టారు. దీంతో గోపీచంద్ మరింత డీప్రెషన్ లోకి వెళ్లాడు. ఎందుకంటే అతను తన కెరీర్‌లో మొదటిసారిగా విమర్శలు, ట్రోల్‌ను ఈ సినిమాతోనే ఎదుర్కొన్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా సంస్థ నిర్మించిన ‘రామబాణం’ ప్రేక్షకులకు ఆకట్టుకోలేదు.

    మే రెండో వారాన్ని పరిశీలిస్తే అరడజనుకు పైగా సినిమాలు విడుదలయ్యాయి. నాగ చైతన్య కథానాయకుడిగా నటించిన ‘కస్టడీ’పై భారీ అంచనాలతో వెడితెరపై అడుగుపెట్టింది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి పని చేసినా కనీసం సంగీత పరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే వారంలో ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’, ‘భువన విజయం’, ‘ఫర్హానా’, ‘కళ్యాణమస్తు’, ‘సంగీత పాఠశాల’, ‘కథ వెనుక కథ’, ‘టీ బ్రేక్’ కూడా ఎలాంటి ప్రభావం చూపించలేదు. అయితే, ఒక రోజు తర్వాత థియేటర్లలోకి వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ పరిమితమైన నిర్మాణ విలువలు ఉన్నప్పటికీ వివాదాల ద్వారా ప్రేక్షకులను గెలుచుకుంది.

    మూడో వారంలో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అన్ని మంచి శకునములే’ బాక్సాఫీస్ వద్ద అధ్వాన్నమైనంగా ఫ్లాప్ ను మూటగట్టుకుంది. మరోవైపు ‘బిచ్చగాడు 2’ హిట్‌గా నిలిచింది. విజయ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొద్ది రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ సాధించి, త్వరగా ప్రాఫిటబుల్ జోన్‌లోకి ప్రవేశించింది. మరోవైపు అదే వారంలో విడుదలైన ‘హసీనా’ ఫ్లాప్‌గా నిలిచింది.

    నాలుగో వారంలోకి అడుగుపెట్టి, ‘జైత్ర’, ‘మేమ్ ఫేమస్’, ‘2018’, ‘మళ్ళీ పెళ్ళి’, ‘మేన్ టూ’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. అందులో ప్రధానంగా నరేశ్ నటించిన ‘మళ్లీ పెళ్లి’, చాయ్ బిస్కెట్ ‘మేమ్ ఫేమస్’ సినిమాలపై దృష్టి సారించింది. అయితే ఆశ్చర్యకరంగా డబ్బింగ్ చిత్రం ‘2018’ అందరి దృష్టిని ఆకట్టుకుంది. విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవరాల్‌గా, ‘బిచ్చగాడు 2’, ‘ది కేరళ స్టోరీ’, ‘2018’తో సహా డబ్బింగ్ చిత్రాలు మే నెలలో విడుదలైన ‘ఉగ్రం’, ‘రామబాణం’ ‘కస్టడీ’ వంటి స్ట్రయిట్ చిత్రాలను వెనుకకు నెట్టాయనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    Monkey : హృదయవిదారకం.. తల్లి చనిపోయిందని తెలియక తన పై పడి లేపుతున్న కోతి

    Mother Monkey Died : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    Monkey : హృదయవిదారకం.. తల్లి చనిపోయిందని తెలియక తన పై పడి లేపుతున్న కోతి

    Mother Monkey Died : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది...