32.3 C
India
Friday, March 29, 2024
More

    దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

    Date:

     

     

     

    వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ ప్రాంతాలను ఎంచుకుని వెళ్తుంటారు. కౌడియాల నుంచి శివపురి వరకు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సుందరమైన ప్రదేశాలు ఉండటంతో వీటిని దర్శించుకుని వస్తుంటారు.

    కోవలం బీచ్ కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది కూడా సుందరమైన ప్రదేశం. అరేబియా సముద్రంలో ఉంది. సముద్రం అందమైన నీలిరంగులో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పొడవైన తాటిచెట్లు, దాని ఒడ్డున ఎత్తైన రాళ్లు అందంగా కనిపిస్తాయి. ఇక్కడ మూడు చంద్రవంక బీచ్ లు ఉండటంతో వాటిని చూడటం కళ్లకు ఎంతో అందంగా అనిపిస్తుంది. దీన్ని సౌత్ లైట్ హౌస్ గా పిలుస్తారు.

    అండమాన్ నికోబార్ దీవుల్లో హేప్ లాక్ ద్వీపంలో రాధానగర్ బీచ్ సుందరమైన ప్రదేశం. అందుకే ప్రతి ఒక్కరు దీన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. హనీమూన్ జంటలు ఇక్కడకు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటారు. దేశంలోనే అత్యుత్తమమైన బీచ్ లలో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంటుంది. రాధానగర్ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీని ఎంజాయ్ చేయొచ్చు.

    గోకర్ణలోని ఓం బీచ్ కూడా మంచి దర్శనీయ ప్రదేశంగా ఉంటుంది. రెండు అర్థ చంద్రాకారపు ముక్కలు ఒకదానికొకటి కలిసినట్లుగా కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆస్వాదించడానికి ఎన్నో అద్భుతాలు మనకు ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉండటం సహజం. పర్యాటకులు అధిక శాతం ఇక్కడకు వస్తుంటారు.

    పూరీలో ఉండే గోల్డెన్ బీచ్ కూడా అందంగా అనిపిస్తుంది. ప్రపంచ పర్యాటక స్థాయి సౌకర్యాలు కల్పించడంలో బ్లూ స్టాగ్ అవార్డు లభించింది. గోల్డెన్ బీచ్ లో దిగ్బరేని స్క్వేర్ నుంచి మేఫెయిర్ హోటల్ వరకు 870 మీటర్ల మేర విస్తరించింది. ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తరచుగా ఇక్కడ శిల్పాలు తయారు చేస్తుంటాడు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...