22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం పెరిగేలా చూసుకోవాలి. చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అందరిని కలుపుకోవాలి. చంద్రధ్యాన శ్లోకం చదివితే చాలా మంచిది.
వ్రషభ రాశి వారికి చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభకరం.
మిథున రాశి వారికి భవిష్యత్ ప్రణాళిక వేసుకుంటారు. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులుంటాయి. ప్రయాణాలు బాగుంటాయి. శివ నామస్మరణ చేయడం ఉత్తమం.
కర్కాటక రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు అందేందుకు తోడ్పడుతుంది.
సింహ రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. శివ అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి మంచి కాలం. అధికారులు సహకరిస్తారు. చేపట్టే పనుల్లో సలహాలు, సూచనలు తీసుుని ముందుకు వెళితే శుభం. ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది.
తుల రాశి వారికి శత్రువులతో జాగ్రత్తలు పాటించాలి. నిందలు మోయాల్సి ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇష్టదేవత ఆరాధన చేయడం మంచి ఫలితాలు కలగజేస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బద్దకాన్ని వదిలేయండి. శ్రీరామ నామం జపించడం మంచిది.
ధనస్సు రాశి వారికి కొత్త బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. సానుకూల అంశాలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి చేస్తుంది.
మకర రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల్లో ముందడుగు వేస్తారు. చంద్రశేఖర అష్టకం చదవడం లాభాలు తెస్తుంది.
కుంభ రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. అవసరానికి సాయం చేసే వారుంటారు. పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గ అష్టోత్తరం చదవడం మంచిది.
మీన రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. విష్ణు సహస్ర పారాయణం శ్రేయస్కరం.